Vyasa Mahabharatam - Upakhyanas in Telugu
This book by Sri Somayaji is written in Telugu. It consists of 212 upakhyanas, from Maha Bharata, emphasizing Neeti, Dharma and Atma tatva. Upakhyanas are backbone of Mahabharatha. Discussions of Neeti- Dharma- Atma tatva in Upakhyanas are the ones that make Mahabharata 5th Veda.
మహాభారతమును ఐదవ వేదమనిరి. జ్ఞానవిజ్ఞాన సర్వస్వమంతయు వేదమునందున్నటులే మహాభారతమునందుకూడ నిక్షిప్తమై యున్నది. మహాభారతకథ యనగా కేవల కౌరవపాండవుల చరిత్రయని అభిప్రాయపడుట సహజము. కాని ఆ కథాభాగములోనే అనేకానేక ఉపాఖ్యానములున్నవి. ఉపాఖ్యానమనగా ప్రథానకథలో చెప్పబడిన చిన్న కథలు. కథలద్వారా ఒక నీతిని, ధర్మమును, తత్వమును సులభముగా చెప్పవచ్చును. ఒక పర్వతమునెక్కుటకు చేతికర్ర నుపయోగించు రీతిని గంభీరతత్వము నెరుగుటకు ఉపాఖ్యానములు అత్యావశ్యాకమై యుండును. మహాభారతమొక ధర్మశాస్త్రము. ధర్మ మనగా ధరించబడునది. ధర్మాధర్మములు రెండింటిని మహాభారతము అనేక ఉపాఖ్యానముల ద్వారా వెల్లడించినది.
ఉపనిషత్ జ్ఞానముచే అధ్యాత్మిక ప్రగతి సాధించవచ్చును. కాని లోకములో వ్యవహరించు జ్ఞానము తెలియకపోవచ్చును. ఆరెండింటిని సంపూర్ణమొనర్చి వేదశాస్త్రార్థములను అల్పబుద్ధులకు సైతము అవగతమగునటుల మహాభారత ఉపాఖ్యానములు రచించబడినవి. కావున మహాభారతము సాంసారిక శాస్త్రమనియు, మోక్షశాస్త్రమనియు పిలువబడినది. మహాభారతమునందు అపూర్వార్థము గలవియు, పుణ్యదాయకమైనవియు, అనేక గ్రంధముల సారమును దెలుపునవియు, ఉత్తమ సంస్కారము బోధించునవియు పెక్కు ఉపాఖ్యానములున్నవి. ధర్మము నుపదేశించి మానవులను సన్మార్గవర్తనులను చేయుటయే ఉపాఖ్యానముల ఉద్దేశ్యమని వేదవ్యాసమహర్షి స్వయముగా పలికెను. ఉపాఖ్యాన పఠనముచే కాయిక, వాచక, మానసిక పాపములు నశించును. మహాభారత కథకు ఆయువుపట్టు ఉపాఖ్యానములే. ఉపాఖ్యానములనెడి పునాదిపై కౌరవపాండవగాధ యనెడి భవంతి నిర్మించబడినది.
మహాభారతముయొక్క పదునెనిమిది పర్వములలో అచటచట ఈ ఉపాఖ్యానములను సందర్భానుసారము వ్యాసమహర్షి రచించెను. ఈ ధర్మతత్త్వోపాఖ్యానములు రెండువందలకు పైచిలుకు మనోహరముగ నున్నవి. వానినన్నిటిని ఏర్చికూర్చి ఈ గ్రంధమును సుమారు 850 పేజీలు క్రౌను సైజులో ముద్రించి కాలికో బైండుతో పాఠకులకు అందించబడుచున్నది. ఈ ధర్మతత్త్వోపాఖ్యానములలో మంకిగీత, బోధ్యగీత, భృగుగీత, మనుగీత, అనుస్మృతి, మోక్షయోగము, పంచశిఖఈత, వ్యాసగీత, కపిలగీత, పరాశరగీత, హంసగీత, వశిష్ఠగీత, యాజ్ఞవల్క్యగీత, కామగీత, అనుగీత కూడా సరళవ్యాఖ్యతో చేర్చబడినవి. అటులనే కురుక్షేత్రమహిమ, ధర్మాధర్మములు, యక్షప్రశ్నలు, విదురనీతి, ధర్మనిర్ణయము, షడ్జగీత, మోక్షోపాయములు, ఆర్షసనాతన ధర్మము, యజ్ఞతుల్య ఉపవాసవ్రతములు, మానస పార్థివ తీర్థములు, స్వధర్మపాలన, సామదానోపాయములు, ధర్మ రహస్యములు, పుణ్యక్షేత్రములు, సర్వదా జపయోగ్య మంత్రస్తుతి మున్నగు తత్త్వవిషయము లెన్నియో చేర్చబడినవి. ఇవిగాక అనేకానేక ధర్మతత్త్వోపాఖ్యానములు పుష్కలముగా విశదమొనర్చబడినవి.
ఇహపరలోక సాధనకు ధర్మమే శ్రేయస్కరము. ఈసత్యమును ఆవిష్కరింప జేయుటకై వేదవ్యాసమహర్షి మహాభారతము నందనేక ఉపాఖ్యానములను చెప్పి యిటుల ఘోషించెను.
ఊర్థ్వబాహు విరోమ్యైష న చ కశ్చిచ్ఛ్రుణోతిమాం
ధర్మదర్థశ్చకామశ్చ సధర్మః కిం న సేవ్యతే
"నేను చేతులెత్తి ఘోషించుచున్నాను. అయిననూ ఎవరూ నామాట వినకుంటిరి. ధర్మాచరణముచే అర్థకామములు సిద్ధించును. అయిననూ ప్రజలు ధర్మాచరణకు ఉత్సుకత చూపించకుంటిరేమి?"
- Buyers who require international shipping also may contact the author - Contact at 9849584555.
- Made available also at Amazon India Flipkart and at Amazon USA
- Not available with any other book retailers.
Look at Sri Saripalle Venkata Subrahmanya Somayaji's Books
Ramayanam, Mahabharatam (Sanskrit-Telugu), Bharata Upakhyanamulu, Bhagavatam, Devi Bhagavatam, Upanishat Bharati, Veda Bharati Charitamrutamu, Harivamsam, Adhyatma Geeta Samuchchayamu (58 Adhyatma Geetas), Harivamsam
No comments:
Post a Comment