సమస్యలను దూరంచేసుకోవటనికి పురాణాలు చదవాలి. భగవంతుడిని కీర్తించే సినిమాలు
లేదా టెలివిజన్ షోలు సమయాభావంవల్ల గాని లేక జనరంజకంగా వుండేందుకోసంగాని
కుదించి ఇవ్వటం జరుగుతుంది. ఇటువంటివాటి ద్వారా పురాణాలలో వుండే
పూర్తి జ్ఞానాన్ని పొందటం సాధ్యం కాదు. జ్ఞానం విస్తరించుకోవటమే
ఏసమస్యలకైనా శాశ్వత పరిష్కారమార్గం.
పురాణాలు అంటే
ఏమిటి?
వేదం అంటే
విజ్ఞానమే. విజ్ఞానం అంటే ఇప్పటివరకు ప్రపంచంలో వున్న శాస్త్రాలన్నీనూ, అలాగే ఇకపై రాబోయే శాస్త్రాలు కూడా. మరి
అటువంటి (భూత, వర్తమాన,భవిష్యత్ శాస్త్రసంపద ఐన) వేదాన్ని అర్థం చేసుకోవటానికి లేదా అర్థమైనదాన్ని
విశదీకరించటానికి పూర్వకాలం నుంచి ఎందరో ఋషులు ఎంతో శ్రమచేసినా తగిన పద్ధతి
కనిపెట్టలేకపోతే విష్ణుమూర్తే స్వయంగా వ్యాసునిగా అవతరించి వేదాన్ని విభజించి
ఆయావిభాగాలను అర్థం చేసుకోవటనికి వేదాంగాలను రచించెను. అయితే అదికూడా ఋషులకు
మాత్రమే అర్థమైయే విధంగా వుందని తలచి ఆయన సామాన్యులకు కూడా ధర్మం, విజ్ఞానం అందించేందుకుగాను పురాణాలు రచించెను. పురాణాలు సత్యమే ఆధారంగా కలవిగాని కట్టుకథలు కావు. ఇవి మనోవికాసానికే కాని మనోల్లాసానికి కాదు.
(వేద)
విజ్ఞానవంతుడికీ, విజ్ఞానం
లేనివాడికీ తేడా ఏమిటి?
జీవితం ప్రయాణం
వంటిది. జ్ఞానం వున్నవాడి జీవితం ...చేతిలో దీపం వున్నపుడు ప్రయాణంలా
చీకటిలో అయినా దారిలో మలుపులు వున్నాఅడ్డంకులు వున్నా అన్నీ స్పష్టంగా కనిపించి
వాటిని దాటుకుంటూ వెళ్ళటానికి అవకాశం వుంటుంది. అదే దీపంవెలుగు లేకుండా ప్రయాణించే
వాడు సూర్యుడున్నంతసేపు మాత్రమే ప్రయాణం చక్కగా చేయగలడు. చీకటిపడగానే దారి
తెలియకనో లేక దారిలోవున్న రాళ్ళూ ముళ్ళూ గుచ్చుకునో దుఃఖాన్ని అనుభవిస్తూ ప్రయాణం
సాగిస్తాడు.
పురాణాలు చదివితే
ప్రయోజనం ఏమిటి?
పురాణాలు చదివినా
లేక విన్నా జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యల నుంచి బయటపడవచ్చు. పురాణాలలో లా
(న్యాయశాస్త్రము), స్ట్రాటజీ
(నీతిశాస్త్రము), సైన్సు (ధర్మ,
ఖగోళ, జీవ,...శాస్త్రములు), సైకాలజీ , ఫిలాసఫీ (తత్త్వశాస్త్రము), సొసైటీకి సంబంధించిన కూలంకషమైన చర్చలు
వున్నాయి. ఏదైనా పురాణ పుస్తకము చదివితే జ్ఞానము విస్తరించి ఆ పాఠకుడి ధర్మ-అధర్మ
విశ్లేషణా శక్తి, నిర్ణయ శక్తి ఎన్నో ఎన్నో రెట్లు పెరుగుతుంది.
ఇది పదే పదే కేవలం ఎదైనా ఒక గ్రంధాన్ని మాత్రమే చదివిన పాఠకులకు అనుభవం. ఇక అనేక
పురాణాలు పలుమారులు చదివిన వారు సమస్యలని వారి విశ్లేషణ-నిర్ణయ శక్తి సహాయంతో దాటి
ఉన్నత ఆశయాలను లక్ష్యాలను సాధిస్తారనటం లో ఏమాత్రం సందేహపడనవసరం లేదు.
Look at Sri Saripalle Venkata Subrahmanya Somayaji's Books
Ramayanam, Mahabharatam (Sanskrit-Telugu), Bharata Upakhyanamulu, Bhagavatam, Devi Bhagavatam, Upanishat Bharati, Veda Bharati Charitamrutamu, Harivamsam, Adhyatma Geeta Samuchchayamu (58 Adhyatma Geetas), Harivamsam
No comments:
Post a Comment