Showing posts with label Atma jnana. Show all posts
Showing posts with label Atma jnana. Show all posts

Wednesday, September 6, 2017

Another book published in Adhyatma Geeta Series

Adhyatma Geeta Manimaala


అధ్యాత్మగీతా మణిమాల - Adhyatma Geeta Manimala  CONTENTS

1. గణేశగీత                                     1.  Ganesha Geeta
2. విదురగీత                                   2. Vidura Geeta
3. అక్షరగీత                                    3. Akshara Geeta
4. అష్టావక్రగీత                               4. Ashtavakra Geeta
5. సూతగీత                                    5. Soota Geeta
6. బ్రహ్మగీత                                   6. Brahma Geeta
7. శ్రీదేవీగీత                                   7. Sri Devi Geeta
8. శ్వేతాశ్వతరోపనిషత్తు                8. Shwetashwataropanishat

Look also Upanishat Bharati book by Sri Saripalle Somayaji

Other Geetas Volumes: Adhyatma Geeta Ratnavali, Adhyatma Geeta Tarangini, Rubhu Geeta + Annapurna Upanishat, Sree Krishna Geeta Trayamu

BUY this book at



Look at Sri Saripalle Venkata Subrahmanya Somayaji's All Books

Ramayanam, Mahabharatam (Sanskrit-Telugu), Bharata Upakhyanamulu, Bhagavatam, Devi Bhagavatam, Upanishat Bharati, Veda Bharati Charitamrutamu, Adhyatma Geeta Samuchchayamu (58 Adhyatma Geetas), Harivamsam

Thursday, July 28, 2016

Adhyatma Geeta Tarangini in Telugu by BrahmaSri SVS Somayaji

Adhyatma Geeta Tarangini in Telugu available from today for readers and researchers of Hindu Philosophy. For copies- contact Sri Somayaji at 9849584555.

About the 'Collection of Geetas' :

ఆర్షవాజ్ఞ్మయములో ఆత్మజ్ఞాన ప్రబోధకములగు అనేక ఋషిప్రోక్త గీతలున్నవి. ఇవి పురాణేతిహాసము లందు పలుచోట్ల వివిధ సందర్భములలో సంవాదరూపముగ ప్రస్తావించబడినవి. గీతలన్నిటిలో శ్రీకృష్ణార్జున సంవాదరూప భగవద్గీత మకుటాయమానమై ప్రసిద్ధి చెందినది. వేదధర్మమునందు భేద, అభేద ఉపాసనలు, సగుణ నిర్గుణ తత్త్వములు ప్రతిపాదించబడినవి.  ఆయా తత్త్వోపాసనా బోధనలను ఋషిపరేణ్యులెందరో ఉపబృంహణమొనర్చి ప్రవచించినవే గీతలుగా విలసిల్లినవి. ఋషిప్రోక్త గీతలన్నియు ఉపనిషత్తులలో, బ్రహ్మసూత్రములలో, భగవద్గీతలో, మహావాక్య బోధలలోనున్న నిగూఢ గంభీరతత్త్వము నర్థము చేసికొనుటకు బహుధా ఉపకరించును. వీనిలో కొన్నిగీతలకు బ్రహ్మవిద్వరేణ్యుల వ్యాఖ్యానములున్నవి. ఆయా వ్యాఖ్యానములను పరిశీలించి చిత్సుఖానందము గలుగునటుల సరళ వివరణ ఈయబడినది. 

Adhyatma Geeta Tarangini
అధ్యాత్మ గీతా తరంగిణి
Adhyatma Geeta Tarangini

Contents:

1. గురుగీత
2. శ్రీదత్తగీత
3. అవధూతగీత
4. అలర్కగీత
5. శివగీత
6. బృహస్పతిగీత
7. రుద్రగీత
8. శ్రీరామగీత
9. శ్రీరామహృదయం
10. హంసగీత
11. హంసగుహ్యస్తోత్రం
12. అరిష్టనేమిగీత
13. యమగీత
14.సనత్కుమారగీత
15. గర్భగీత
16. వైరాగ్యగీత
  

Look at Sri Saripalle Venkata Subrahmanya Somayaji's Books

Ramayanam, Mahabharatam (Sanskrit-Telugu), Bharata Upakhyanamulu, Bhagavatam, Devi Bhagavatam, Upanishat Bharati, Veda Bharati Charitamrutamu, Adhyatma Geeta Samuchchayamu (58 Adhyatma Geetas), Harivamsam

Wednesday, July 13, 2016

Rubhu Geeta Coming Soon

One more book  'Rubhu Geeta' in the 'Collection of Geetas', a book series by SVS Somayaji, is coming up soon this year.
Rubhu Geeta

Look at Sri Saripalle Venkata Subrahmanya Somayaji's All Books

Ramayanam, Mahabharatam (Sanskrit-Telugu), Bharata Upakhyanamulu, Bhagavatam, Devi Bhagavatam, Upanishat Bharati, Veda Bharati Charitamrutamu, Adhyatma Geeta Samuchchayamu (58 Adhyatma Geetas), Harivamsam

Tuesday, July 7, 2015

Upanishad Bharathi - 10 Upanishats in Telugu with Sankara Bhashyam

Ten Upanishats in Telugu with Adi Sankaracharya Bhashyam

This book for Upanishats written in simple and easy to understand Telugu. Available with the author and on Amazon.in (search with author's name or with title). Buyers required international shipping also may contact the author at 98495 84555 .
Upanishad Bharati Telugu
వేదశాఖలందున్న జ్ఞానకాండయే ఉపనిషత్తులు. ఇవి చిరప్రదీప్త జ్ఞానదీపికలు. ఇవి సృష్ట్యాది నుండి లయపర్యంతము ప్రకాశించునవి. వీని ప్రకాశములో అమరత్వమున్నది. ఏది సమస్త అనర్థముల నుత్పన్నము చేయు సంసారమును నాశనమొనర్చునో, ఏది సంసారమునకు కారణభూతమగు అవిద్యను శిధిలమొనర్చునో, ఏది బ్రహ్మప్రాప్తికి ఉపకరించునో అదియే ఉపనిషత్తు అని దార్శనికులు వర్ణించిరి. ఉపనిషత్తులకు మరొక పేరు వేదాంతము. అనగా వేదములయొక్క సిద్ధాంతమును, చరమ తాత్పర్యమును వర్ణించునవని అభిప్రాయము. 
వేదము స్వయముగా అనంతము. వేదశాఖలు కూడ అనంతము. కనుక వేదోపనిషత్తులు కూడ అనంతములనుటలో ఆశ్చర్యమేమున్నది? కాని వేదశాఖలుకూడ అనేకము విలుప్తములగుటచే చాల ఉపనిషత్తులు కూడ కాలగర్భములో కలిసిపోయినవి. ప్రస్తుతము నూట ఎనిమిది ఉపనిషత్తులు మాత్రమే లభ్యమగుచున్నవని ముక్తికోపనిషత్ చెప్పినది. ఆ నూట ఎనిమిది  ఉపనిషత్తులలో ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండూక్య, తైత్తిరీయ, ఐతరేయ, ఛాందోగ్య, బృహదారణ్యకమను పది ఉపనిషత్తులు మాత్రమే గంభీరతర అర్థప్రతిపాదికములై యున్నవి. వీనినే పూర్వాచార్యులు బ్రహ్మవిద్యకు ప్రమాణభూతములుగా నెంచిరి. వీనిలో మాండూక్యోపనిషత్ అతిచిన్నది. బృహదారణ్యకోపనిషత్ అతిపెద్దది. బృహదారణ్యక, ఛాందోగ్యోపనిషత్తులలో అన్య ఉపాసనా విశేషములు ఉల్లేఖించిననూ అవి బ్రహ్మము-ఆత్మ యొక్క ఏకత్వమునే ప్రధానముగా బోధించినవి. ఉపనిషత్తులలో ప్రతిపాదించిన జ్ఞానమే అన్నిటికన్న ఉత్కృష్టమైనది. మానవులకు కర్మ-ఉపాసన-జ్ఞానోపదేశముల ద్వారా అధ్యాత్మ పథముపై నడిపించుటయే వేదముయొక్క ముఖ్యోద్దేశము. ఎవరు ఏ అవస్థలోనున్ననూ వారిని ఆయా అవస్థలనుండి అధ్యాత్మ ప్రగతికి గొనిపోవుటయే వేదము యొక్క లక్ష్యము.

ఉపనిషత్తులలో ప్రధానముగా ఆత్మజ్ఞాన నిరూపణయే యున్ననూ కర్తవ్యోపదేశము లెన్నియో ఉదహరించబడినవి. అవియన్నియు పరమహితకరములు. అధ్యాత్మవిద్యయే సర్వదుఃఖములను నివృత్తిచేయును. అవియే పరమానందరూప మోక్షమును ప్రాప్తింపజేయును. అందుచే బ్రహ్మవిద్య ప్రతిపాదకమగు ఉపనిషత్తులు సమస్త విద్యలలో శ్రేష్ఠములని చెప్పబడినవి. అందుచే ఈ దశోపనిషత్తులను ఆదిశంకరుల భాష్యము ననుసరించి అందరికి అర్థమగు రీతిలో తెనుగు వచనముగా రచించబడినది.

ఉపనిషత్ బోధ పొందిన జ్ఞానికి ఇంక తాను తెలుసుకొనవలసినది గాని, పొందవలసినదిగాని యుండదు. ఆవిధముగ జ్ఞాని కృతకృత్యుడై నిత్యబోధమయ నిజస్వరూపమునందు ప్రతిష్ఠితుడగును.  అతడు సచ్చిదానందమును సర్వత్రా అనుభవించును. అట్టివాడే జీవన్ముక్తు డనబడును. జీవన్ముక్తుడు పరమానంద లాభమును పొంది బ్రహ్మముయొక్క అద్వితీయ చిన్మయసత్తలో ప్రవేశించును. అతడు బ్రహ్మీభూతస్థితిని పొందును. జీవ - బ్రహ్మైక్య - జ్ఞాననిష్ఠలకు అదియే చివరిహద్దు. అదియే ఉపనిషత్ జ్ఞానము యొక్క పరాకాష్ట. భారతులారా మేల్కొనుడు.  వేదమాత మిమ్ములను మేల్కొలుపుచున్నది. మీరు భారతఖండములో భారతభూమిలో జన్మించితిరి. ఇదొక మహద్భాగ్యము. అద్యాత్మవిద్య - బ్రహ్మవిద్య మీ గృహస్థ నిధులు.  వానిని ఇచ్చ్ఛానురీతిని వినియోగించి శాశ్వతసుఖశాంతులు పొందుడు. దుఃఖములను దూరమొనర్చుకొనుడు. పరమోజ్జ్వల శాంతిపథముపై పయనించి ఆత్మోన్నతి పొందుడు.

CONTENTS


ఈశావాస్యోపనిషత్                            Ishavasyopanishat
కేనోపనిషత్                                       Kenopanishat
కఠోపనిషత్                                       Kathopanishat
ప్రశ్నోపనిషత్                                    Prashnopanishat
ముండకోపనిషత్                               Mundakopanishaat  
మాండూక్యోపనిషత్                           Maandookyopanishat
తైత్తిరీయోపనిషత్                              Taittireeyopanishat
ఐతరేయోపనిషత్                              Aitareyopanishat
ఛాందోగ్యోపనిషత్                               Chamdogyopanishat
బృహదారణ్యకోపనిషత్                       Bruhadaaranyakopanishat

For Sweataswatara Upanishat, 

Look at Adhyatma Geeta Manimaala book by Sri Saripalle Venkata Subrahmanya Somayaji


For Annapurna Upanishat, 

Look at Rubhu Geeta book by Sri Saripalle Venkata Subrahmanya Somayaji


Look at Sri Saripalle Venkata Subrahmanya Somayaji's Books

Ramayanam, Mahabharatam (Sanskrit-Telugu), Bharata Upakhyanamulu, Bhagavatam, Devi Bhagavatam, Upanishat Bharati, Veda Bharati Charitamrutamu, Harivamsam, Adhyatma Geeta Samuchchayamu (58 Adhyatma Geetas), Harivamsam